Residential College | మహబూబాబాద్ : గురుకుల పాఠశాలల్లో అత్యంత దయనీయ పరిస్థితులు వెలుగు చూస్తున్నాయి. తినడానికి సరిగ్గా తిండి కూడా లేదు. పౌష్టికాహారం అందించాల్సింది పోయి మాడిపోయిన అన్నం, గొడ్డుకారం పెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్నారు.
పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల కాలేజీని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూనియర్ కళాశాల వంట గదులను, విద్యార్థుల బ్రేక్‌ఫాస్ట్‌ను ఆమె పరిశీలించారు. మాడిపోయిన కిచిడి, గొడ్డుకారంతో విద్యార్థులకు అల్పాహారం పెట్టడంపై ఆర్సీవో రత్నకుమారిపై సత్యవతి రాథోడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన మెనూ పాటిస్తూ వసతి సౌకర్యాలు కల్పించాలని మాజీ మంత్రి ఆదేశించారు.