యాదగిరిగుట్ట, యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహా ఆలయంలో బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. యాదగిరిగుట్ట ప్రధానాలయ ముఖ మండపంలో ఆలయ ప్రధానర్చకుల బృందం విశిష్ట పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. ఉదయం 10 గంటలకు స్వయంభు నారసింహుడి గర్భలయానికి ప్రవేశించి ఉత్సవాలను ప్రారంభించారు.
ముఖ మండపంలో తూర్పు అభిముఖంగా ఉత్సవమూర్తులను ఉంచి విశ్వక్సేన ఆరాధన స్వస్తివాచనము, రక్షబంధనాన్ని నిర్వహించారు. సాయంత్రం 6.30 గంటలకు మృత్సంగ్రహణం, అంకురారోహణాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో గీత, అర్చక బృందం, ఆలయ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 3 వ తేదీ వరకు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు వివరించారు.