తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తీర్మానం
ఆర్కేపురం, మే 1: బ్రాహ్మణుల కులవృత్తి పౌరోహిత్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తీర్మానించింది. సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వన్నంపల్లి జగన్మోహన్ శర్మ అధ్యక్షతన శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. సమాఖ్య ప్రతిపాదించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్ కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ వాణీదేవి తెలిపారు.
సమావేశంలో ఎమ్మెల్సీ దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సమాఖ్య ప్రతినిధులు తులసి శ్రీనివాస్, కార్యదర్శి మునిపల్లె శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగేశ్వర సిద్ధాంతి, సలహాదారులు బోర్పట్ల హనుమంతచారి, వేవులపల్లి వాణి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 500 మంది కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.