హైదరాబాద్, ఆగస్టు18 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీ యాజమాన్య బోర్డు చైర్మన్‌గా బీపీ పాండే సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బోర్డు చైర్మన్ ఎంకే సిన్హా గత నెల ఉద్యోగ విరమణ పొందగా, ఆయన స్థానంలో బీపీ పాండే నియమితులయ్యారు. ఈ మేరకు జలసౌధలోని బోర్డు కార్యాలయంలో చైర్మన్‌గా ఆయన బాధ్యతలను స్వీకరించారు.
తెలంగాణ ఈఎన్సీ అమ్జద్హుస్సేన్, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ (ఎన్‌డబ్ల్యూడీఏ) సీఈ దేవేందర్‌రావు, ఇంటర్‌స్టేట్ విభాగం గోదావరి డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్య ప్రసాద్, ఎస్ఈ అజ్మల్‌ఖాన్ బోర్డు చైర్మన్ పాండేను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.