రవీంద్రభారరతి, ఆగస్టు 25: కులగణన చేయకుంటే దేశవ్యాప్తంగా అగ్గి రాజేస్తామని బీసీ సంక్షేమం సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కేంద్రప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం సామాజిక న్యాయ జేఏసీ అధ్యక్షుడు ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్ ఆధ్వర్యంలో బీపీ మండల్ 106 జయంతి వేడుకలు రవీంద్రభారతిలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రప్రభుత్వం బీపీ మండల్ విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించాలని, జయం తి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీపీ మండల్ మనువడు, హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్‌యాదవ్ పాల్గొన్నారు.