అయిజ, జూన్ 13 : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్ద ధన్వాడలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును స్థానికులు, రైతులు బహిష్కరించారు. గ్రామంలోని రైతు వేదిక వద్దకు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు తహసీల్దార్ రామ్మోహన్ ఆధ్వర్యంలో అధికారులు చేరుకున్నా రైతులెవరూ హాజరుకాలేదు.
కొద్దిసేపటి తర్వాత కొందరు వచ్చి సదస్సును బహిష్కరిస్తున్నట్టు వినతిపత్రం అందజేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ శాంతియుత పోరాటం చేస్తున్నవారిపై కంపెనీ యాజమాన్యం, బౌన్సర్లు, పోలీసులతో కలిసి రెచ్చగొట్టేలా భయభ్రాంతులకు గురిచేశారని చెప్పారు. పోరాటం ఆపబోమని స్పష్టంచేశారు.