హైదరాబాద్ : సిరిసిల్ల పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. సెప్టిక్ ట్యాంక్లో(Septic tank) పడి బాలుడి మృతి చెందాడు.ఈ విషాదకర సంఘటన సిరిసిల్ల సర్ద్పూర్నగర్లో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న ఇంటి ఆవరణలో ఆడుకుంటుండగా నికేష్ అనే ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న సెప్టిక్ ట్యాంక్లో పడి మృతి చెందాడు.
బాలుడు చాలా సేపు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. శుక్రవారం సెప్టిక్ ట్యాంక్లో అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే అతడిని దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందాడని ధృవీకరించారు. నికేష్ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.