ఏటూరునాగారం, జూలై 25: ములుగు జిల్లా ఏటూరునాగారం-చిన్నబోయినపల్లి మధ్యలో జాతీయ రహదారిపై చెట్టు బైక్‌పై వస్తున్న యువకుడిపై కూలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నబోయినపల్లికి చెందిన జహంగీర్ (30) గ్రామంలో మెడికల్ షాపు నడుపుతున్నాడు.
మందులను తీసుకెళ్లేందుకు ఏటూరునాగారానికి వస్తున్న క్రమంలో రోడ్డుపై అకస్మాత్తుగా చెట్టు కూలింది. దీంతో జహంగీర్ అక్కడికక్కడే మృతి చెందాడు. జహంగీర్‌కు ఏప్రిల్‌లో వివాహం నిశ్చయం కాగా, సెప్టెంబర్‌లో పెళ్లి జరగాల్సి ఉన్నది.