తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల పండుగ.. వద్దిరాజు రవిచంద్ర
బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే జానపద, ఆధ్యాత్మిక వేడుక అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. బోనాల పండుగ సందర్భంగా శనివారం ఆయన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ) : బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే జానపద, ఆధ్యాత్మిక వేడుక అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. బోనాల పండుగ సందర్భంగా శనివారం ఆయన ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడూతూ.. రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలన వరకు ఈ పండుగ విశిష్టత ప్రపంచ నలుమూలలకూ వ్యాపించిందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బోనాలను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి, ఉత్సవాల నిర్వహణకు ప్రత్యేక నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు. అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరి జీవితాల్లో ఆనందం, శాంతి వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
సందేశాత్మక చిత్రాలకు మంచి ఆదరణ
- ‘నో లాంగర్ హ్యూమన్’ షార్ట్ ఫిల్మ్ చూసి చిత్రబృందానికి అభినందనలు తెలిపిన జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే చిత్రాలను ప్రజలు ఎప్పటికీ ఆదరిస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. యువ దర్శకుడు లిఖిత్ తిరునగరి రూపొందించిన ‘నో లాంగర్ హ్యూమన్’ షార్ట్ ఫిల్మ్‌ను శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్‌రెడ్డి లఘు చిత్రాన్ని వీక్షించి మాట్లాడుతూ.. వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఫిల్మ్ ఉన్నదని కొనియాడారు. ఇది తప్పకుండా ప్రజల్లో మంచి ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

