Aadarsha Kutumbam Teaser | టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (హౌస్ నంబర్: 47 / AK 47) సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మేకర్స్ సోషల్ మీడియాలో కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టీజర్‌ను రేపు మధ్యాహ్నం 12:00 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ చిత్రంలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. “నువ్వు నాకు నచ్చావ్”, “మల్లీశ్వరి” వంటి క్లాసిక్ ఫ్యామిలీ హిట్స్ అందించిన త్రివిక్రమ్ మాటలు, వెంకటేష్ కామెడీ టైమింగ్ మళ్లీ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంది.
The ENTERTAINMENT levels are about to LEVEL UP! 🔥😎#AadarshaKutumbam 🏠 TEASER OUT TOMORROW @ 12:00 PM 🔥
In Cinemas #AK47OnOCT2nd 🥳#AK47 | #Venky77 | #VenkateshXTrivikram pic.twitter.com/8GvqdIWAaa
— Haarika & Hassine Creations (@haarikahassine) September 11, 2026