హైదరాబాద్/తొర్రూరు, సెప్టెంబర్ 14 : బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరుకు చెందిన యాదవ సంఘం నాయకుడు బొమ్మనబోయిన రాజేందర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో.. మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రులు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాజేందర్ మాట్లాడుతూ.. తొర్రూరు అభివృద్ధికి గతంలో ఎవరు చేయని విధంగా మంత్రి ఎర్రబెల్లి కృషి చేశారన్నారు. సీఎం కేసీఆర్ రూ.25లక్షలు, మంత్రి కేటీఆర్ రూ.25 లక్షలు ప్రత్యేకంగా నిధులు కేటాయించి పట్టణాభివృద్ధికి ఎంతో పాటుపడ్డారన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం కోసం పని చేస్తామని చెప్పారు.