హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) వచ్చే విమానాలకు బాంబు బెదిరింపుల (Bomb Threat) పరంపర కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వస్తున్న రెండు విమానాలకు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో మూడు విమానాలకు బెరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్పోర్ట్ సిబ్బంది, పోలీసులు అలర్ట్ అయ్యారు. తనిఖీలు చేపట్టారు.
సోమవారం ఉదయం కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్, లండన్-హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో వీటిని సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అనతరం బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. విమానాలకు ఐసోలేషన్‌కు తరలించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉన్నది.