శంషాబాద్ రూరల్, నవంబర్ 18: శంషాబాద్ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌లో బాం బులు పేలుతాయని శంషాబాద్ ఎయిర్‌పోర్టు భద్రత అధికారులకు మంగళవారం ఉదయం ఈ మెయిల్ వచ్చింది. కసబ్‌ను మైనర్‌గా విచారణ చేయకుండా ఉరితీశారని పేర్కొన్నారు. దీంతోపాటు ఎయిర్‌పోర్టులో ని ప్రయాణికులు, సిబ్బందిని వెంటనే ఖాళీ చేయించాలని లేకపోతే పెద్దఎత్తున నష్టం జరుగుతుందని బెదిరించారు.
అప్రమత్తమై న అధికారులు విస్తృతంగా తనిఖీలు చేయ గా, ఎలాంటి బాంబులేదని తేల్చారు. ఈ మెయిల్‌పై పోలీసులకు ఎయిర్‌పోర్టు అధికారులు ఫిర్యాదు చేశారు.