ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 21:23:50

కార్మిక సంఘాలతో వినోద్‌కుమార్‌ భేటీ

కార్మిక సంఘాలతో వినోద్‌కుమార్‌ భేటీ

హైదరాబాద్‌ :  సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులతో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బుధవారం భేటీ అయ్యారు. గురువారం సార్వత్రిక సమ్మె నేపథ్యంలో టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వారికి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న చర్యలకు నిరసనగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

లాభాల బాటలో నడుస్తున్న ఎల్ఐసీ, బీఎస్ఎన్ఎల్, రైల్వే, హెచ్ఏఎల్ వంటి అనేక సంస్థలను నట్టేట ముంచుతున్న ప్రధాని చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించారు. సమావేశంలో సీఐటీయూ ఇన్‌చార్జి వీరయ్య, నాయకులు వెంకటేశ్‌, భాస్కర్, ఏఐటీయూసీ నాయకులు నరసింహన్, బోస్, నర్సింహ, బాలరాజు, టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, ఇన్‌చార్జి రూప్ సింగ్, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు యాదవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.