హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల సరళిని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బృందం పరిశీలించింది. వినోద్ నేతృత్వంలో ఎమ్మెల్సీ తకళ్లపల్లి రవీందర్రావు, తెలంగాణ పౌర సరఫరాలశాఖ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్, నాయకుడు రంగినేని పవన్‌కుమార్(ఆదిలాబాద్), హైదరాబాద్ నుంచి ఇద్దరు సీనియర్ జర్నలిస్టులతో కలిసి మహారాష్ట్రలో రెండురోజులపాటు పర్యటించారు. మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లోని పలు శాసనసభ నియోజకవర్గాల్లో ఉన్న గ్రామాలను సందర్శించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాందేడ్, కిన్వట్, బోఖార్, నాయిగొన్, ముఖేడ్ ప్రాంతాల్లో విద్యావేత్తలు, న్యాయవాదులు, ఇంజినీర్లు, రాజకీయ విశ్లేషకులను కలిసి మహారాష్ట్ర ఎన్నికల సరళిపై అభిప్రాయాలు సేకరించారు.