చిక్కడపల్లి, జూలై 20 : రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని, మళ్లీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ)ఆధ్వర్యంలో సోమవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సభలో టీటీయూసీ నాయకులు బీఆర్టీయూలో భారీగా చేరారు.
కార్యక్రుమానికి వినోద్‌కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు రాంబాబుయాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి హాజరయ్యారు. టీటీయూసీ నాయకులు దేవానంద్, పరమేశ్వర్, రామన్న, హరిబాబు, లక్ష్మణ్, రాజుతోపాటు పెద్దసంఖ్యలో కార్మికులు బీఆర్టీయూలో చేరారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. పో రాడి సాధించుకున్న తెలంగాణ, నేడు మూ ర్ఖుల చేతిలోకి పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. హామీలు అమలుచేయకుండా కాంగ్రెస్ దగా చేసిందని మండిపడ్డారు.