Sudarshan Reddy | హైదరాబాద్ : బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వరించకపోవడంతో.. ఆయన అనుచరులు, మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే లోపు సుదర్శన్ రెడ్డికి తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు. ఈ క్రమంలో పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. సంతకాలతో కూడిన రాజీనామా లేఖలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు పంపారు.
సుదర్శన్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే లోపు తప్పకుండా మంత్రి పదవి ఇవ్వాలి
లేకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుంది
రేపు బోధన్ బంద్‌కు పిలుపునిచ్చిన స్థానిక కాంగ్రెస్ నేతలు
పార్టీ పదవులకు మూకుమ్మడి రాజీనామా
రాజీనామా లేఖలు పీసీసీ చీఫ్‌కు… https://t.co/RPxqhg0Z53 pic.twitter.com/BedL03ZmMk
— Telugu Scribe (@TeluguScribe) June 9, 2025