హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్‌ను అరెస్టు చేసే విషయంలో అతిగా, అనుచితంగా ప్రవర్తించిన బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్‌పై బదిలీవేటు పడింది. అతడిని విశాఖలోని ఆరిలోవ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఐదు రోజుల క్రితం కేవీఆర్‌ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సీఐ శ్రీనివాస్ బొబ్బిలికి తీసుకెళ్లారు. అయితే, అరెస్ట్ సమయంలో కేవీఆర్ భార్య విజయలక్ష్మి పట్ల అనుచితంగా ప్రవర్తించారు. నేరుగా ఆమెను వెనుక నుంచి కదలకుండా గట్టిగా పట్టుకొన్నారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండా ఓ మహిళపట్ల అతను ప్రవర్తించిన తీరును తెలంగాణ సమాజం మొత్తం తీవ్రంగా ఖండించింది.
అనంతరం కేవీఆర్ భార్య హైదరాబాద్ సరూర్‌నగర్ పీఎస్‌లో సీఐ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైన రెండు రోజుల్లోనే సీఐ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదే కేసులో గతంలో కేవీఆర్‌ను అరెస్ట్ చేయడంలో విఫలమైన బాడంగి ఎస్సైని కూడా ఏపీ పోలీసు అధికారులు వీఆర్‌కు పంపినట్టు సమాచారం.
యూట్యూబర్ రావణ్‌గా ప్రజలకు పరిచయమున్న తన భర్తపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదంటూ ఆయన భార్య అనూష ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో తిరుగుతున్న వీడియో ఏఐతో సృష్టించినదని, రావణ్ కులాన్ని కూడా వక్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, కులాలు, మతాల పేరిట జరిగే విద్వేషాలకు తమ కుటుంబం వ్యతిరేకమని అన్నారు. ప్రజలకు వాస్తవాలు చేరాలి కాబట్టి తన భర్తది కమ్మ కులం అని, పేరు కూడా అధికారికంగా రావణే అని స్పష్టత ఇచ్చారు. తమకు ఏ పార్టీలతో సంబంధాలు లేవని, గొంతులేని వర్గాలకు ఒక గొంతుగా నిలువడమే లక్ష్యమని చెప్పారు.