ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా సిరికొండలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి.. కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి హాజరయ్యారు.
అలాగే.. తెలంగాణ భవన్లో తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం మహిళా విభాగం తరుపున కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి కవితకు మహిళా ఉద్యోగినులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుశీల రెడ్డి, ప్రభారెడ్డి, సువర్ణ రెడ్డి, మణిమంజరి, తోగుల లీల, మంజూల రాణి, సత్తెమ్మ, తామణి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.