MP Dharmapuri Arvind | నిజామాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. నిరు డు నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణను ఎదుర్కోవాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేయగా, దళిత సంఘాలు కన్నెర్ర చేశాయి. ఈ మేరకు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దళితుల మ నోభావాలను దెబ్బతీశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజామాబాద్‌లోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్లో బంగారు సాయిలు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్వింద్‌పై కేసు నమోదైంది.
అర్వింద్ హైదరాబాద్‌లోని మాదన్నపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో వ్యాఖ్యలు చేయడంతో, నిజామాబాద్ పోలీసులు కేసును ఇక్కడికి బదిలీ చేశారు. మాదన్నపేట పోలీసులు విచారణ చేయకుండా ఉండేందుకు ఈ కేసుపై అర్విం ద్ స్టే తెచ్చుకున్నాడు. చట్టప్రకారం విచారణ నుంచి తప్పించుకునేందుకు హైకోర్టు తలుపు తట్టడంతో ఇన్ని రోజులపాటు విచారణలో జాప్యం జరిగింది. ఈ వ్యవహారంపై శుక్రవారం హైకోర్టులో విచారణ కొనసాగగా ఎంపీకి చుక్కెదురైంది. 2022 జనవరి 2న నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై విచారణకు ముందుకెళ్లాల్సిందిగా హైకోర్టు స్పష్టంచేసింది. ఎఫ్ఐఆర్ నమోదుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన అర్విం ద్.. ఇక విచారణను ఎదుర్కోవాల్సిందేనని హైకోర్టు తీర్పు చెప్పింది. తీవ్రమైన చర్యలు తీసుకోవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.