 
                                                            హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ మంత్రివర్గ విస్తరణకు అనుమతి ఇవ్వొద్దని బీజేపీ ఎమ్మెల్యే పాయల్‌శంకర్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, పార్టీ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ మెంబర్ ఆంథోనిరెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) సుదర్శన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఓ వర్గం ఓట్ల కోసమే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారని ఆరోపించారు.
ఇది మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియామవళిని ఉల్లంఘించడమేనని తెలిపారు. అజారుద్దీన్ 2023లో జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సైతం పోటీ చేసినట్టు గుర్తుచేశారు. వెంటనే మంత్రివర్గ విస్తరణను నిలిపివేయడంతోపాటు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్‌చేశారు. బీజేపీ ఫిర్యాదు నేపథ్యంలో ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టు సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా ముందుకెళ్లామని చెప్పారు.
 
                            