మేడ్చల్ రూరల్, జులై 9: కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పోకుండా విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. మేడ్చల్ మండలంలోని మునీరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో నిరుద్యోగులు, విద్యార్థులు రోడ్డెక్కారని, వారిపై లాఠీచార్జీలు చూస్తే బాధ కలుగుతుందని అన్నారు. నిరుద్యోగుల డిమాండ్లకు బీజేపీ మద్దతు పలుకుతూ, విద్యార్థుల ఉద్యమాల్లో పాల్గొంటామని చెప్పారు.