Arvind Dharmapuri | హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బీజేపీకి సీఎం రేవంత్‌రెడ్డి సహకారం ఉందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన ఓ టీవీ చానల్ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాకే బీజేపీ రాష్ట్రంలో బలపడిందని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది తమ పార్టీ నేతల చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు.
రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను బేస్‌మెంట్‌తో సహా కూల్చివేయడం ఖాయమని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల ముందు ప్రజలు రేవంత్ రెడ్డిని తురుంఖాన్ అనుకున్నారని.. కానీ అయన జోకర్, పేపర్ పులి అని తేలిపోయిందని విమర్శించారు. ప్రజలు రేవంత్‌రెడ్డిని ద్వేషిస్తున్నారని, గ్రామాలకు వెళ్తే కొట్టే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. సబ్జెక్ట్ లేకపోవడంతోనే రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు.