తెలంగాణచౌక్ ( కరీంనగర్) : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘బీజేపీ హటావో..దేశ్‌కి బచావో ’ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని సీపీఐ (CPI) జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో బుధవారం నిర్వహించిన పార్టీ విస్త్రత స్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. నరేంద్ర మోదీ (Narendra Modi)ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముగాస్తు దేశసంపదను దోచి పెడుతున్నదని మండిపడ్డారు.
నల్లధనం(Block Money) తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15లక్షలు జమ చేస్తానని చెప్పిన ప్రధాని అధికారంలోకి రాగానే పేదలను మోసం చేశారని విమర్శించారు. రుణాలు ఎగ్గొటి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ(Neerav Modi), మాల్యాలను ఎందుకు దేశానికి రప్పించడంలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆదానీ(Adani) కుబేరుడుగా ఎదడానికి ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi), హోం మంత్రి అమిత్‌షా(Amit shah) సహకరిస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో కార్మికులు, కర్షకులకు ఒరిగిందేంలేదని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు కొయ్యడ సృజన్కమార్, పార్టీ నగర కార్యదర్శి సురేందర్‌రెడ్డి. బూడిద సదాశివ పాల్గొన్నారు.