సోమవారం 25 జనవరి 2021
Telangana - Jan 03, 2021 , 14:06:45

‘సార్‌’ సమాధి ఆక్రమణకు బీజేపీ వత్తాసు: చీఫ్‌ విప్‌ దాస్యం

‘సార్‌’ సమాధి ఆక్రమణకు బీజేపీ వత్తాసు: చీఫ్‌ విప్‌ దాస్యం

వరంగల్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ సమాధి స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ అన్నారు. కబ్జాకోరులకు బీజేపీ నేతలు మద్దతు పలుకుతున్నారని విమర్శించారు. ప్రొ. జయశంకర్‌ సార్‌ పట్ల బీజేపీ నేతల వైఖరి ఏమిటని ప్రశ్నించారు. జయశంకర్‌ సార్‌ విరాళం ఇచ్చిన స్థలంలోనే ఆయన సమాధి ఉందని చెప్పారు. సమాధి స్థలాన్ని కబ్జాచేసి రాజకీయం చేయడం సరికాదని సూచించారు. సార్‌ సమాధి ఉండాలా.. వద్దా.. అనే విషయంలో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేవాదాయ శాఖ భూమి అయితే దానికి డబ్బులు చెల్లిస్తామన్నారు. స్థలం విషయంలో నిజనిర్ధారణ కమిటీ వేస్తే అసలు విషయం తెలుస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. 

దేవాలయ భూములు, సమాధులను కబ్జా చేయడం సరికాదని ఎంపీ బండ ప్రకాశ్‌ అన్నారు. తన జీవితాంతం తెలంగాణ కోసం పరితపించిన వ్యక్తి సమాధి స్థలాన్ని కబ్జా చేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తంచేశారు.  సమాధులను కబ్జా చేసేవారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్‌ను మించిన ధార్మికుడు మరొకరు లేరని చెప్పారు. 


logo