నల్లగొండ రూరల్, ఫిబ్రవరి 15: ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని 1994లోనే బీసీల్లో చేర్చారని, సీఎం స్థాయిలో ఉన్న రేవంత్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సబబు కాదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హితవుపలికారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వస్తే అన్నీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చి, కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడగడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుతో పాటు ఎడ్యుకేషనల్ బడ్జెట్ రెట్టింపు చేస్తామని, యూనివర్సిటీలను అప్డేట్ చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, నాయకులు కాసం వెంకటేశ్వర్లు, గంగిడి మనోహార్‌రెడ్డి, మాదగోని శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రావు, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.