హైదరాబాద్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘రేవంత్‌రెడ్డీ.. తెల ంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏంటి? ఏ నాడైనా జై తెలంగాణ అని ఉద్యమించినవా?’ అని బీజేపీ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. ఉద్యమకారులపై దాడి చేసిన రేవంత్‌రెడ్డిని నాడు తెలంగాణ సమాజం ఛీ కొట్టిందని, ఇప్పుడు ఏదో లక్కీగా సీఎం అయ్యాడని ఎద్దే వా చేశారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమంలో యాత్రలు, పోరాటాలు చేశారని, అ నేకసార్లు అరెస్టు అయ్యారని చెప్పా రు. ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.13 వేల కోట్లు ఇస్తే మొత్తం రుణమాఫీ పూర్తవుతుందని చెప్పారని, కానీ సీఎం పాలమూరు లో 3 వేల కోట్లతో రుణమాఫీ పూర్తయిందని ప్రకటించడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ మా ట్లాడుతూ.. సీఎం రేవంత్ ఏడాది పాలనలో ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని మండిపడ్డారు. ప్రాజెక్టులు రా కుండా అడ్డుకుంటూ డెమోలిషన్ మ్యాన్‌గా, పేదల ఇండ్లు కూల్చివేస్తూ డిస్మాంటిలింగ్ మ్యాన్‌గా, రాష్ట్రానికి విలువలేకుండా చేసి డీవ్యాల్యుయేష న్ మ్యాన్‌గా, ప్రజలకు ఇచ్చిన హామీ ల నుంచి దృష్టి మరల్చుతూ డైవర్షన్ మ్యాన్‌గా, చివరికి ఆయనే డిస్టర్బ్డ్ మ్యాన్‌గా మారారని ఎద్దేవా చేశారు.