హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మళ్లీ బెదిరింపు ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఇటీవలే ఆయనకు కొందరు ఆగంతకులు కాల్ చేసి చంపేస్తామని బెదిరించడంతో ఆర్మ్డ్ సిబ్బందితో ఎస్కార్ట్ వాహనాన్ని రక్షణగా ఇచ్చారు. ఆదివారం మళ్లీ రెండు కొత్త ఫోన్ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వచ్చినట్టు రఘునందన్‌రావు తెలిపారు.
ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని, లేకుంటే ఎట్టి పరిస్థితిలో వదిలేది లేదని, త్వరలోనే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పారు. 9489556347, 7365035440 నంబర్ల నుంచి బెదిరింపులు రావడంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. అయితే, ఫోన్ చేసిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు చంపడానికి ఐదు బృందాలు రంగంలోకి దిగాయని చెప్పినట్టు తెలిసింది. దీంతో రఘునందన్‌రావు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.