హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని.. రాష్ర్టాన్ని పాలించే నైతిక హక్కు రేవంత్‌కు లేదని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాటాడుతూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ వాటిని చెల్లించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందిరమ్మ ఇండ్లలో కాంగ్రెస్ కార్యకర్తలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.