DK Aruna | సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. లగచర్ల ఘటనలో కుట్ర కోణం ఉందనుకోవడం లేదని తెలిపారు. కుట్ర కోణం ఉండి ఉంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించి శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం అట్టర్‌ఫ్లాప్ అయ్యిందని విమర్శించారు.
ఫార్మా కంపెనీపై గ్రామాల్లో వ్యతిరేకత ఉందని డీకే అరుణ తెలిపారు. అలాంటప్పుడు కలెక్టర్ వెళ్లినప్పుడు ఎందుకు భద్రత కల్పించలేదని ప్రశ్నించారు. ఘటన జరిగినప్పుడు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు ఆగ్రహానికి గురైన మాట వాస్తవమని అన్నారు. ప్రజలు వ్యతిరేకిస్తున్న ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డికి ఎందుకంత ప్రేమ అని నిలదీశారు. అసలు ఆ ప్రాజెక్టు ఎవరిది.. దాని వెనుక ఉన్నది ఎవరో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై ఇంకా పట్టు రాలేదని డీకే అరుణ అన్నారు. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని అన్నారు. ఇంటర్నెట్ ఎందుకు బంద్ చేశారని ప్రశ్నించారు. గ్రామాల్లో ఏమైనా ఉగ్రవాదులు ఉన్నారా అని నిలదీశారు.