MLA Raghunandan rao | హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పార్టీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి ఒక్కసారిగా అణుబాంబులా పేలింది. కిషన్‌రెడ్డికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించటంపై పలువురు నేతలు తీవ్రంగానే స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆ పదవి ఆశిస్తున్నట్టుగా ప్రచారమైన కొందరు ఎమ్మెల్యేలు, సీనియర్లు పార్టీ అధిష్ఠానంపై కూడా కారాలు మిరియాలు నూరుతున్నారు. అధ్యక్ష పదవి ఆశావహుల్లో ఒకరిగా ఉన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అయితే, పార్టీ నిర్ణయంపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. పనిలోపనిగా బీజేపీ అధిష్ఠానం తెలంగాణలో వెలగబెట్టిన నిర్వాకాలన్నీ బయటపెట్టారు. ఆయన పలువురు మీడియా ప్రతినిధులతో ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యింది. అందులో కిషన్‌రెడ్డి నియామకం, అమిత్‌షా రాజకీయ చతురతపై రఘునందన్ ఘాటుగానే స్పందించారు.
ఆడియోలో రఘునందన్ మాట్లాడిన మాటలు ఇవి..