హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఏనాడూ ఇచ్చిన మాటపై నిలబడలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో సర్కారు హడావుడి చూస్తే బీసీలకు కాంగ్రెస్ మోసం చేస్తున్నట్టే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.
ఆర్డినెన్స్ తీసుకురాకుండానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటుచేసి అమలుపై చర్చించాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన చిక్కులు రాకుం డా సర్కారు చొరవ చూపాలని ఆయన సూచించారు.