హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో బ్లీచింగ్ కొనేందుకు కూడా ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఆరోపించారు. శనివారం పంచాయతీరాజ్ పద్దులపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేసవికి గ్రామాల్లో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
‘అంగన్వాడీ భవనాల పూర్తికి నిధులు లేవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్టు ఈ ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. సిర్పూర్, ఆసిఫాబాద్‌లలో కూడా కొత్త పింఛన్లు ఇవ్వలేదు’ అని ఆరోపించారు. మంత్రి సీతక్క వివరణ ఇస్తూ.. నీటి ఎద్దడి నివారణకు రూ.200 కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.