హన్వాడ/భూపాలపల్లి రూరల్/నర్మెట, మే 13: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్శితులై ప్రధాన పార్టీల నాయకులు, వివిధ కుల సంఘాల నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం నాగంబాయి తండాకు చెందిన బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరగా, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సమక్షంలో రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు తుమ్మల మొగిలి, ఉపాధ్యక్షుడు సాదు రాజు, కార్యదర్శి సిద్ద తిరుపతి, డైరెక్టర్లతోపాటు వివిధ కుల సంఘాల నాయకులు సుమారు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. జనగామ జిల్లా నర్మెటలో యాదవ సంఘ సభ్యులు, యువకులు సుమారు 50 మంది ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.