హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన బీజేపీ నేతలు బీఆర్ఎస్లో చేరారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీకి చెందిన పీఏసీఎస్ మాజీ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, పలువురు నాయకులకు మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.
కార్యకర్తలకు ఎలాంటి కష్టం వచ్చినా పార్టీపరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బీ నరేందర్, సీనియర్ నేతలు చెన్నయ్య, పీఏసీఎస్ చైర్మన్ వెంకటయ్య, హరిచందర్, ఖాజన్గౌడ్, వెంకన్న, యాదయ్యగౌడ్, ప్రవీణ్‌కుమార్‌గౌడ్, తేజవర్ధన్, ఆటో వెంకటయ్య, చిన్నచెన్నయ్య, వేణు, ఆర్ రవీందర్, రాజుగౌడ్ పాల్గొన్నారు.