కరీంనగర్‌లోని 51వ డివిజన్‌కు చెందిన 50 మంది బీజేపీ నాయకులు శుక్రవారం మాజీమంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలోనే నగరం అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవట్లేలేదని విమర్శించారు. -కరీంనగర్ కార్పొరేషన్