విద్యానగర్ (కరీంనగర్) మే 1: మంత్రి పొన్నం ప్రభాకర్ పెద్ద అవినీతి పరుడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి, ఆరోపణలు, వ్యవహారశైలిని చూసి కాంగ్రెస్ నేతలే అసహ్యించుకుంటున్నారని విమర్శించారు.
బుధవారం ఆమె కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్‌పై ఘాటు విమర్శలు చేశారు. పొన్నం ఓ ట్రావెల్స్ అధినేత నుంచి రూ.కోటిన్నర విలువైన కారును తీసుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్టీపీసీ బూడిద కాంట్రాక్టర్ల నుంచి లంచాలు తీసుకున్న ఘనత కూడా ఆయనదేనని ఆరోపించారు. ఈ సామ్‌పై విచారణ జరపాలని కోరారు.