నర్సంపేట/నల్లబెల్లి/మక్తల్, అక్టోబర్ 3 : బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుగులోత్ లక్ష్మణ్‌నాయక్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వరంగల్ జిల్లా ఖానాపురం మండలానికి చెందిన ఆయన శుక్రవారం బీజేపీకి రాజీనామా చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లిలోని పెద్ది స్వగృహంలో బీఆర్ఎస్లో చేరగా, గులాబీ కండువా కప్పి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చి చేరుతున్నట్టు లక్ష్మణ్‌నాయక్ ప్రకటించారు. ఖానాపురం మాజీ ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్‌రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట జిల్లా మక్తల్‌లోని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నివాసంలో చిత్తనూరు గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలోనే రాష్ట్ర ప్రజలందరికీ మంచి రోజులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తేతెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధమైంది. రెండు విడతల్లో నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 1,35,264 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం కాగా, 1,18, 547 బ్యాలెట్ బాక్స్‌లు అందుబాటులో ఉన్నాయని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.