BJP | మణిపూర్ సంక్షోభాన్ని తప్పుదోవ పట్టించిన మోదీ.. బీజేపీలో దుమారం రేపుతున్న మాజీ ఎంపీ వివేక్ కొడుకు వ్యాఖ్యలు
ప్రధాని మోదీ, బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ కొడుకు, విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వంశీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
- మణిపూర్ ఘటనను ఉదహరిస్తూ వీడియో పోస్ట్
- సోషల్ మీడియాలో వైరల్
BJP | పెద్దపల్లి, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ, బీజేపీ నాయకత్వంపై ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గడ్డం వివేక్ కొడుకు, విశాఖ ఇండస్ట్రీస్ అధినేత వంశీ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. కాషాయపార్టీలో దుమారం రేపుతున్నాయి. బుధవారం వంశీ తన ఎక్స్(ట్విటర్)లో ఓ వీడియో పోస్టు చేశారు. ‘ప్రధాని మోదీ పార్లమెంట్లో రాహుల్‌గాంధీ ఫ్లయింగ్ కిస్కు ఇచ్చిన ప్రాధాన్యం మణిపూర్ ఘటనకు ఇవ్వలేదని, ఈ అల్లర్లలో ఎందరో మహిళలు బలైపోయారని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ మౌనం వహించడం బాధాకరమని, ప్రతిపక్షాలు పార్లమెంట్లో అవిశ్వాసం పెట్టి, చివరి నిమిషంలో ఓటింగ్ జరగకుండానే వాకౌట్ చేయడం సరైన చర్య కాదని, బీజేపీ నేతలు ఈ చర్చలో పాల్గొననే లేదని తెలిపారు.
మణిపూర్ సంక్షోభాన్ని తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు. ఈ తీరుతో దేశంలో అంతర్యుద్ధానికి దారితీసే అవకాశముంటుందని, ఇప్పటికైనా కనువిప్పు కలగాలి.. అని హెచ్చరించారు. ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో దానిని తొలగించగా, అప్పటికే అది వైరల్‌గా మారింది. ఫేస్‌బుక్‌తోపాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో దుమారంగా మారింది. బుధవారమే తాను ఏ పార్టీలో చేరడం లేదని, బీజేపీలోనే ఉంటానని మాజీ ఎంపీ వివేక్ చెప్పిన 24 గంటల్లోనే ఆయన తనయుడు వంశీ ఇలా ప్రధానీ మోదీ, బీజేపీని విమర్శించడం చర్చనీయాంశంగా మారింది. వివేక్ కాంగ్రెస్‌లో చేరుతారన్న ఊహాగానాల నేపథ్యంలోనే ఆయన తనయుడు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BJP
- Gaddam Vivek
- Pm Modi
- Vamshi
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

