ఉద్యోగం, వ్యాపారంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు కుటుంబ జీవితం ఎలా ఉంటుందో చెప్పాలంటే ఈ ఫొటోలా ఉంటుందని చెప్పొచ్చు! షేక్ హ్యాండ్‌తో అటొకరు, ఇటొకరు ఉన్నారు. వీళ్లిద్దరూ భార్యాభర్తలు. హోమ్ బ్యూటీ, వెల్నెస్ సర్వీస్ కంపెనీ ఎస్ మేడమ్ వ్యవస్థాపకులు. కంపెనీ విస్తరణ, నిర్వహణ కోసం ఇద్దరూ దేశంలోని యాభై నగరాలకు తిరుగుతూ ఉంటారు. ఒక్క చోట ఉండే అవకాశం లేదు. గరిమా శర్మ ఒక మీటింగ్‌కి వెళ్లి వస్తుంటే, మరో మీటింగ్‌కి వెళ్లేందుకు విమానాశ్రయానికి ఆదిత్య ఆర్య చేరుకున్నాడు.
హడావుడి ప్రయాణంలో అక్కడ ఆమె ఎదురుపడింది. ఇద్దరూ తొంబై సెకన్లు మాట్లాడుకున్నారు. ఇదే సంగతిని ఫొటోతో ఆదిత్య, గరిమా ఇన్‌స్టాలో పంచుకున్నారు. కలిసి ఉండే అవకాశం లేని జీవితంలో కలుసుకున్న కొన్ని సెకన్లు ఎంత విలువైనవో రాసుకొచ్చారు. వ్యాపార విజయాల కోసం కుటుంబ జీవితాల్లో ఎన్ని త్యాగాలుంటాయో చెప్పే ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వార్తల్లోకి ఎక్కింది.