కొల్లాపూర్, ఆగస్టు 8 : శ్రీశైలం జలాశయం నిండుకుండలా ఉ న్నా, నీళ్లు ఎత్తిపోయక ఒట్టిపోయిన కాల్వలతో కళాహీనంగా ఉ న్న ఎంజీకేఎల్ఐపై బీఆర్ఎస్ గొ ంతు విప్పడంతో ప్రభుత్వంలో కలవరం మొదలై కదిలిక వచ్చింది. పక్క రాష్ట్రం కృష్ణానది నీటిని గ్రావిటీ ద్వారా, ఎత్తిపోతల ద్వారా తరలిస్తుంటే కృష్ణా బేసిన్‌పై నికర వాటా కలిగిన ఉమ్మడి ప్రాజెక్టులను ఆన్ చేయకుండా.. రైతుల పంటలకు సాగునీరు అ ందకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వమే రైతులపై కుట్రలు చేస్తుందని రైతులు విమర్శలు గు ప్పించారు. రైతుల బాధలు తెలిసిన బాధ్యతాయుత పార్టీ బీఆర్ఎస్ నాయకులు ఎంజీకేఎల్, పాలమూరు పంప్‌లను ఆన్ చే యకపోతే నార్లాపూర్‌ను ముట్టడిస్తామని హెచ్చరించిన గంటల వ్యవధిలోనే ఎంజీకేఎల్ఐ పంప్‌లను ఆన్ చేయడంతో ఆయకట్టు రైతులు సంతోష పడుతున్నారు.
ఎంజీకేఎల్ఐ స్టేజీ-3లోని గుడిపల్లి రిజర్వాయర్ ఎంజీకేఎల్ఐ ఆ యకట్టుకు అయువుపట్టు లాంటిది. రిజర్వాయర్ సామర్థ్యం ఒక టీఎంసీగా ఉండగా.. ప్రాజెక్టులోని ఆయకట్టులోని మూ డింట రెండు వంతుల భాగం (సుమారు 2. 80 లక్షల ఎకరాలకు) సాగునీరు అందుతోంది. గుడిపల్లి లిఫ్ట్ ప్రతి పంప్ 650 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుంది. వానకాలంలో శ్రీ శైలం జలాశయం నిండుగా ఉన్నప్పుడు 24 గంటల పాటు రోజుకు 0.28 టీఎంసీలను ప్రధాన కాల్వల ద్వారా పొలాలకు తరలించవచ్చు. అచ్చంపేట బ్రాంచ్ కెనాల్ ద్వారా 1000 క్యూసెక్కుల వరకు తరలిస్తే, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ద్వారా పంట కాల్వలకు సాగునీరు అందించవచ్చని తెలుస్తోంది.
సీఎం సొంత ప్రాంతానికి కూడా డీ-83 కాల్వ ద్వారా సాగునీరు అం దుతోంది. వానకాలంలో సరైన సమయంలో వర్షాలు లేక ఎంజీకేఎల్ఐ సాగునీటి కోసం ఎదురుచూస్తున్న సొంత ప్రాంత రైతులకు శ్రీశైలం జలాశయం నిండా నీళ్లు ఉన్నా అంది ంచలేదనే విమర్శలను సీఎం రేవంత్‌రెడ్డి సొంతం చేసుకున్నారని పలువురు విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ ఒత్తిడితో గుడిపల్లి లిప్ట్ను ఆన్‌చేయడంతో సీఎం సొంత ప్రాంతానికి చెందిన రైతులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎప్పుడూ రైతుల పక్షం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
కాలం కాలేదని భావిస్తున్న రైతులకు ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వచ్చిన వరద సంతోషాన్ని నింపింది. ఎంజీకేఎల్ఐ, పాలమూరు లిఫ్ట్లలోని పంప్‌లను ఆన్ చేస్తే కరువు నుంచి తప్పించుకోవచ్చని రైతులు భావించారు. కొన్ని చోట్ల నారుమడిని సైతం రైతులు సిద్ధం చేసి ఉంచారు. కాఈన పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ప్రాజెక్టుల నుంచి కృష్ణా బేసిన్‌లోని నీటిని పక్క రాష్ట్రం తరలించుకు వెళ్తుంటే.. ఎంజీకేఎల్ఐ, పాలమూరు పంప్‌లను ఇక్కడి ప్రభుత్వం ఆన్ చేయకపోవడంతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. శ్రీశైలం జలాశయానికి వరద వచ్చిన 15 రోజుల వరకు కూడా గుడిపల్లి లిఫ్ట్ ఆన్ చేయలేదు.
దీంతో బీఆర్ఎస్ నాయకత్వం శుక్రవారం పంప్‌లను ఆన్ చేయాలని.. లేకపోతే 11వ తేదీన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వం లో నార్లాపూర్‌కు లక్షలాదిగా రైతులతో కదులుతాం.. అక్కడే కార్యాచరణ ప్రకటించి స ర్కార్ కండ్లు తెరిపిస్తామని మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. దీంతో ప్రభుత్వంపై ఆగమేఘాలపై కదిలిక వచ్చింది. 15 రోజులపాటు ఆన్ చేయని స్టేజీ-3లోని గుడిపల్లి నుంచి 3 పంప్‌లను ఆన్ చేసి ప్రధాన కాల్వకు సాగునీరు విడుదల చేశారు. అలాగే స్టేజీ-1లోని 3 పంప్‌లను, స్టేజీ-2లోని 2 పంప్‌లను ప్రారంభించారు. బీఆర్ఎస్ ఒత్తిడితో కాంగ్రెస్ ప్రభుత్వంలో కదిలిక వచ్చిందని ఎంజీకేఎల్ఐ ఆయకట్టు రైతులు భావిస్తున్నారు.