కేవీల్లో ప్రిన్సిపాళ్ల కొరత.. 25% పోస్టులు ఖాళీ
కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీలు) ప్రిన్సిపాళ్ల కొరత కనిపిస్తున్నది. 25% స్కూళ్లకు రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేరు. జాతీయంగా 1,356 కేంద్రీయ విద్యాలయాల్లో కేవలం 1,012 పాఠశాలల్లో రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేదా గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగిలిన 344 కేవీలు ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి.
హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : కేంద్రీయ విద్యాలయాల్లో(కేవీలు) ప్రిన్సిపాళ్ల కొరత కనిపిస్తున్నది. 25% స్కూళ్లకు రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేరు. జాతీయంగా 1,356 కేంద్రీయ విద్యాలయాల్లో కేవలం 1,012 పాఠశాలల్లో రెగ్యులర్ ప్రిన్సిపాళ్లు లేదా గ్రేడ్-2 ప్రిన్సిపాళ్లు ఉన్నారు. మిగిలిన 344 కేవీలు ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. ఈ వివరాలను కేంద్ర విద్యాశాఖ పార్లమెంట్‌కు వెల్లడించింది. 2015-16లో దేశవ్యాప్తంగా 1,142 కేవీలు ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 1,356కు చేరింది. 214 పాఠశాలలు అదనంగా ఏర్పడ్డాయి.
ప్రిన్సిపాళ్లు లేకపోవడంతో ఒక్కరికే రెండు స్కూళ్ల బాధ్యతలు అప్పగిస్తున్నారు. 2025 నవంబర్‌లో 8,714 బోధన పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ అ య్యింది. దీంట్లో 161 ప్రిన్సిపాల్ పోస్టులున్నాయి. 2025 డిసెంబర్లో నూ 2,153 బోధన పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంట్లోనూ 157 ప్రి న్సిపాల్ పోస్టులున్నాయి. ప్రిన్సిపాల్, ఇ తర సిబ్బంది ఖాళీలు పేరుకుపోవడం తో కేవీల్లో విద్యాప్రమాణాలు దెబ్బతింటున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్చార్జి బాధ్యతలు, కాంట్రాక్ట్వారితో కేవీలు నడిపించాల్సి వస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

