సంగారెడ్డి నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): ‘కిషన్ అన్నా నేను ఈ రోజు పెట్రోల్ పోసుకుని చచ్చిపోతా.. నువ్వు రాష్ట్ర అధ్యక్షుడివి కదా.. నీ పేరు చెప్పి నేను చచ్చిపోతా.. నువ్వు నన్ను మోసం చేశావు.. నీ కార్యాలయానికి నన్ను ఎం దుకు పిలిచావు? నామినేషన్ వేసుకో బీఫాం పంపిస్తా అన్నావు.. బీఫాం ఇస్తానని నమ్మబలికి మోసం చేశావు.. నాకు కాకుండా ఇంకొక్కరికి బీఫాం ఎలా ఇస్తావు? నేను పార్టీకి ఏమి అన్యాయం చేశాను? నా ఇజ్జత్ తీస్తున్నావు.. బీఫాం ఇవ్వకపోతే చచ్చిపోతా.. నా ఇజ్జత్ తీశావు.. నేను ఏమి అన్యా యం చేశా అన్నా’-ఇది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో ఆ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన రాజేశ్వరరావు దేశ్‌పాండే జరిపిన ఫోన్ సంభాషణ. ఈ వీడియో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో వైరల్‌గా మారింది.
సంగారెడ్డి టికెట్‌ను రాజేశ్వర్‌రావు ఆశించారు. అయితే అధిష్ఠానం మాత్రంపులిమామిడి రాజుకు టికెట్ కేటాయించిం ది. దీంతో రాజేశ్వర్‌రావు హుటాహుటిన కిషన్‌రెడ్డిని కలిసి తనకు న్యాయం చేయాలని కోరినట్టు సమాచారం. దీం తో బీజేపీ అధిష్ఠానం పులిమామిడి రాజు స్థానంలో రాజేశ్వర్‌రావు దేశ్‌పాండేకు టికెట్ ఇస్తున్నట్టు శుక్రవారం ఉదయం ప్రకటించింది. రాజేశ్వర్‌రావు నామినేషన్ వేసేందుకు సంగారెడ్డి ఎన్నికల కార్యాలయానికి సమీపించగానే సీన్ రివర్స్ అయ్యింది. అనూహ్యంగా బీజేపీ అధిష్ఠానం బీఫాంను రాజేశ్వర్‌రావుకు కాకుండా పులి మామి డి రాజుకు అందజేసింది. దీంతో రాజేశ్వర్‌రావు పార్టీ అధిష్ఠానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి కార్యాలయం నుంచే కిషన్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడి తన ఆవేదన, ఆక్రోశం వెళ్లగక్కారు.