హైదరాబాద్, మార్చి 13(నమస్తే తెలంగాణ ) : ‘ఎన్నికలకు ముందు అడ్డగోలు హామీలిచ్చి, ఇప్పుడు చేతగాదం టూ తప్పించుకోవడం ఏమిటి? మీకు పాలన చేతకాకుంటే మళ్లీ ఎన్నికలకు వెళ్లండి’ అని కాంగ్రెస్ సర్కార్‌కు బీజేఎల్పీ నేత ఏలేటీ మహేశ్వర్‌రెడ్డి సవాల్ విసిరారు. 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింట్లో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. శాసనసభలో గవర్న ర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై గురువారం ఆయన మాట్లాడారు. ఇది పాపాల కాంగ్రెస్ పాలన అంటూ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ స ర్కారు ఏడాదిలోనే 1.5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నదంటూ మండిపడ్డా రు. మహేశ్వర్‌రెడ్డి సవాల్‌ను మంత్రి శ్రీధర్‌బాబు స్వీకరించారు. పొరుగు రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్యంతో ఉన్న ప్రభుత్వం తమ కన్నా ఎక్కువ ఏమి చేస్తున్నదో పోల్చుకొని చూడాలని కోరారు. మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు తామూ రెడీ.. సవాల్‌ను స్వీకరిస్తున్నాం.. అని
ప్రతిస్పందించడం గమనార్హం.