హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ) : కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బీహార్, వెస్ట్‌బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ ఓట్లు తొలగిస్తున్నట్టు విమర్శించారు. రాష్ట్రంలో 3.38 కోట్ల ఓట్లు ఉంటే, 73 లక్షలపైగా ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. 2002 కండిషన్‌తో ఎన్యుమరేషన్ ఫామ్ ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని తెలిపారు.
ఆన్మ్యాపింగ్ ఓట్లు 32.37 వేలు, 60 లక్షలపైగా ఓట్లు సందేహాస్పదంగా ఉన్నాయని, బీఎల్ఏలు 35వేల ఓట్లకు రిసిప్ట్ ఇచ్చారని, ఎలక్షన్ కమిషన్ 13,100 ఓట్లు అని చూపిస్తుందని పేర్కొన్నారు. కోటి 60 లక్షల ఓటర్లు ఎందుకు క్వచన్ మార్క్ చేశారని ప్రశ్నించారు. బీఎల్ఏ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఎలా తప్పు చూపిస్తారని, ఈసీ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 1.60 కోట్ల ఓట్లకు ఎందుకు అభ్యంతరం చెప్పారో ఈసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2002 వివరాలతో సంబంధంలేకుండా వివరాలు సరిగా ఉంటే ఓటుహక్కు కల్పించాలని మహేశ్‌కుమార్ కోరారు.