Harish Rao | బీఆర్ఎస్ ఒత్తిడి పెడితే మూడు మోటార్లు నడుపుతున్నారు : హరీశ్ రావు
harish rao ఏపీలోనేమో క్రాప్ హాలీడే లేదు.. తెలంగాణలో మాత్రం క్రాప్ హాలీడే. దీనిక్కారణం నీళ్లు లేక కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం.. అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
Harish Rao | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేతకాక నీటి నిర్వహణలో వైఫల్యం చెంది ఈ రోజు ఎల్‌నినో పేరు చెప్పి తప్పించుకుంటున్నరు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో ఎల్‌నినో కాదు కరువు.. కాంగ్రెస్ వల్ల కరువు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు అన్నారు.
నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్ రావు మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలో ఎక్కడా క్రాప్ హాలీడే లేదు. కానీ తెలంగాణకు మాత్రం క్రాప్ హాలీడే ప్రకటించారు. 2 రాష్ట్రాలకు అదే కృష్ణా, గోదావరి నదులు.. ఏపీలోనేమో క్రాప్ హాలీడే లేదు.. తెలంగాణలో మాత్రం క్రాప్ హాలీడే. దీనిక్కారణం నీళ్లు లేక కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేతగానితనం.. కాంగ్రెస్ ప్రభుత్వ చేతగాకనే ఈ రోజు ఈ రాష్ట్రంలో కరువుపరిస్థితుల వల్ల రైతాంగం కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇది నేను నోటిమాట చెప్పడం లేదు.. రాజకీయ ఆరోపణ అంతకంటే కాదు.. ఇది వాస్తవం.. ఎందుకీ ఇది ఖచ్చితంగా వాస్తవం అని నేను చెప్తున్నాను.
ఉదాహరణకు మీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్నే తీసుకోండి.. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 5 మోటార్లున్నాయి. వీటిలో అయితే ఒకటి నడుపుతున్నరు.. లేకపోతే రెండు.. ఎప్పుడైనా నేనొస్తా అంటే.. బీఆర్ఎస్ ఒత్తిడి పెడితే మూడు మోటార్లు నడుపుతున్నారు. ఈ మూడు కూడా రోజుకు 8 గంటలు మాత్రమే నడుపుతున్నరు. ఉదయం 8 :30 గంటలకు మోటార్లు ఆన్ చేస్తున్నరు.. సాయంత్రం 4 : 30 గంటలకు బంద్ చేస్తున్నరు. నడపాల్సిన మోటార్లు 5 అయితే.. నడుపుతున్నయి 3 అని అన్నారు.
24 గంటలు 5 మోటార్లు నడిపితే 4,000 క్యూసెక్కుల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు.. కానీ ఈ దద్దమ్మ ప్రభుత్వం కేవలం 800 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే లిఫ్ట్ చేస్తుందని మండిపడ్డారు. అందుకే అంటున్నాము.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.. పరిపాలన చేతకాక, ఎల్ నినో పేరు చెప్పి తప్పించుకుంటున్నారన్నారు.
ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకు?
రెండు రాష్ట్రాలకు నీళ్లు వచ్చేది కృష్ణా, గోదావరి నదుల నుంచే కదా
కల్వకుర్తిలో 5 మోటర్లు నడపాల్సింది కేవలం 3 మోటర్లు నడుపుతున్నారు
నడుపుతున్న మోటర్లు కూడా కేవలం 8 గంటలే నడుపుతున్నారు
24 గంటలు 5 మోటర్లు నడిపితే 4,000 క్యూసెక్కుల నీళ్లు… pic.twitter.com/c97ZDDB2sJ
— Telugu Scribe (@TeluguScribe) September 23, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

