నాంపల్లి, సెప్టెబర్ 23 : వినాయకుడి నవరాత్రుల్లో భాగంగా ఏర్పాటు చేసిన లడ్డూకు వేలం నిర్వహించకుండా నాంపల్లి మండలం దామెర గ్రామంలో నవ చైతన్య యూత్ ఆధ్వర్యంలో కులం మతంతో సంబంధం లేకుండా ప్రతి ఇంటికి పంపిణీ చేశారు. అందరికి దేవుడి ప్రసాదం స్వయంగా ఇంటికి వచ్చి ఇవ్వడంతో గ్రామస్తులు సంతోషిస్తూ యూత్ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లోజు ప్రవీణ్ చారి, దామెర సహదేవ్, భూతరాజు నాగార్జున, సిలువేరు ఆంజనేయులు, వట్టిపల్లి నరేష్, మండల మహేష్, దామెర జగన్, వట్టిపల్లి నాగరాజు, జంపాల ఆంజనేయులు, జంపాల కోటేష్, సురేష్, జస్వంత్, అబ్దుల్ రహీం, సమీర్ పాల్గొన్నారు.