Harish Rao | కాంగ్రెస్‌కు చేతగాక క్రాప్ హాలిడే వైపు దృష్టి : మాజీ మంత్రి హరీష్‌రావు
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక తెలంగాణలో క్రాప్ హాలిడే కు పరుగులు తీస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ఆరోపించారు.
నాగర్ కర్నూల్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతగాక తెలంగాణలో క్రాప్ హాలిడే ( Crop Holiday ) కు పరుగులు తీస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ( Harish Rao ) ఆరోపించారు. చంద్రబాబుకు గురుదక్షిణగా శ్రీశైలం ( Srisailam ) నీటిని పాలమూరు జిల్లాకు వదలడం లేదని విమర్శించారు. నాగర్ కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైతాంగం కన్నీళ్లు పెడుతోందని అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో 5 మోటార్లు ఉంటే ఒకటి, రెండు మహా అయితే మూడు మాత్రమే నడిపిస్తు న్నారని దుయ్యబట్టారు. 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజక వర్గానికి చంద్రబాబు నీళ్లను తరలిస్తుండగా ,సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో మాత్రం నీళ్లు పారించడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో 30 ఏళ్లలో పూర్తి కానీ ప్రాజెక్ట్ లను పరుగులు పెట్టించాం. 26వేల ఎకరాల ఆయకట్టును ఆరున్నర లక్షల ఎకరాలకు పెంచామని స్పష్టం చేశారు. శ్రీశైలంలో నీళ్లు ఉన్నా ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సమ్మక్క బ్యారేజ్ కట్టి 365 రోజులు నీళ్లు ఎత్తిందని, దేవాదుల వద్ద ఎందుకు 8 గంటలు మాత్రమే నడుపుతున్నారని తెలిపారు. మూడేళ్లలో కట్టిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సవాల్ విసిరారు.
కేవలం 8.8 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసి 88 టీఎంసీలు ఎలా చెబుతున్నారని నిలదీశారు. నెట్టెంపాడు, తుమ్మిళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎవరు కట్టారో ప్రజలకు తెలుసని అన్నారు. కాలం తెచ్చిన కరువు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని పేర్కొన్నారు. కరువు పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. .కరువు వస్తే ప్రతి చుక్క నీళరు ఎత్తిపోసుకోవాలని సూచించారు. ప్యాకేజీ 3 పనులు యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేసి కరివెన వరకు రిజర్వాయర్లలో నీళ్లు నింపాలని డిమాండ్ చేశారు . ప్రతిపక్షాల మీద కమీషన్ లు వేయడం, లేదా 30శాతం కమిషన్ దండుకోవడం మాత్రమే కాంగ్రెస్‌కు తెలుసని విమర్శించారు.
కృష్ణ నదిలో 34శాతం తెలంగాణకు వాటా ఉండగా కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగా 25 శాతం మాత్రమే వాడారని ఆరోపించారు. పాలమూరు , నల్గొండ, ఖమ్మం జిల్లాలను మంత్రి ఉత్తమ్ కుమార్ మోసం చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుల ద్వారా ఎంత నీరు వాడాలో వైట్ పేపర్‌ను రిలీజ్ చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్‌లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
Ajay Devgn | అక్రమ నిర్మాణాల కూల్చివేత.. అజయ్ దేవగణ్‌కు షాక్ ఇచ్చిన బీఎంసీ
Pratima Singh | ఫామ్ పాండ్లతో బహుళ ప్రయోజనాలు.. గడువులోగా పనులు పూర్తి చేయాలి : కలెక్టర్ ప్రతిమా సింగ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

