‘ఆయుర్వేదంతో ఆరోగ్య పరిరక్షణ’
ఆయుర్వేద వైద్య విధానంతో అనేక రకాల అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన చికిత్స అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి పి. లక్ష్మి సౌజన్య అన్నారు. బుధవారం 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని...
– అయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి పి.లక్ష్మి సౌజన్య
కట్టంగూర్, సెప్టెంబర్ 23 : ఆయుర్వేద వైద్య విధానంతో అనేక రకాల అనారోగ్య సమస్యలకు సహజసిద్ధమైన చికిత్స అందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారి పి. లక్ష్మి సౌజన్య అన్నారు. బుధవారం 11వ అంతర్జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని అయిటిపాముల ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. లక్ష్మి సౌజన్య మాట్లాడుతూ.. ప్రజలు ఆయుర్వేద వైద్యంపై అవగాహన పెంచుకుని, ఆరోగ్య పరిరక్షణలో యోగ, ధ్యానాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. యోగ, ధ్యానం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవచ్చని తెలిపారు. ఆయుర్వేద వైద్య విధానంలో అందుబాటులో ఉన్న చికిత్సా పద్ధతులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేసి ఆయుర్వేద వైద్యంపై అవగాహన కల్పించారు. యోగ ఇన్స్ట్రక్టర్ నిర్మల, శరత్ ఆధ్వర్యంలో యోగ, ధ్యానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బెల్లి సుధాకర్, వైద్య సిబ్బంది ఫార్మసిస్టు ఎం. చంద్రయ్య, సి.హెచ్. ఉమారాణి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

