హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ నాయకులు పగటి కలలు కంటున్నారని, పది జన్మలెత్తినా తెలంగాణాలో ఆ పార్టీ అధికారంలోకి రాలేదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ పర్యటనలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు.
సీఎం కేసీఆర్‌పై మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదన్నారు. ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో మోదీ ప్రభుత్వం దేశానికి చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని పరిరక్షించాల్సిన కేంద్రం ప్రైవేట్ కంపెనీలకు ధారదత్తం చేస్తున్నదని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అవినీతి రొంపిలో కూరుకుపోయిందని దుయ్యబట్టారు.